దేశానికి ఆదర్శంగా ఆరుట్ల స్కూల్

దేశానికి ఆదర్శంగా ఆరుట్ల స్కూల్
  • అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి
  •  సీఎంవో కార్యదర్శి వి.శేషాద్రి ఆదేశం

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆరుట్ల పాఠశాలను కేవలం రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ వి.శేషాద్రి ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్​ను ఆయన సందర్శించారు. హౌజింగ్ ఎండీ గౌతమ్ పొట్రు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి పాఠశాల వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు.

అనంతరం గ్రామస్తులు, తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాల పురోగతిపై చర్చించారు. ఆరుట్ల పాఠశాలను కేవలం రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని శేషాద్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈవో సుశీందర్ రావు, ఆర్డీవో అనంతరెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.