విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు..చేయాల్సిన పని వదిలిపెట్టి స్టూడెంట్స కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. విద్యార్థులకు మంచి మార్గం చూపించాల్సిన టీచర్లే డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేరళలోని వడకరలో వెలుగులోకి వచ్చిన MDMA రవాణలో కేసులో ముగ్గురు టీచర్లతో సహా ఓ డెలివరీ బాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.దర్యాప్తులో భాగంగా నిందితుల వాట్సాప్ మేసేజ్ లు, బ్యాంకు అకౌంట్ల ట్రాన్సాక్షన్లు పరిశీలించిన పోలీసులు..డ్రగ్స్ సరఫరా వెనుక కింగ్ పిన్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ అమ్మకాలతో వచ్చిన డబ్బును డెలివరీ బాయ్ ద్వారా కింగ్ పిన్ కు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన వారి బ్యాంకు అకౌంట్లలో భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా డెలివరీ బాయ్ అకౌంట్లో గత ఆరు నెలల్లో కోటి రూపాయలకు పైగా ట్రాన్సాక్షన్లు జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడటం, డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం వారి వ్యక్తిగత జీవితాలనే కాదు.. యువత భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ఇలాంటి ఘటనలు వృత్తి గౌరవాన్ని, నైతిక బాధ్యతను గుర్తుచేస్తున్నాయి.
