జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నర్సరీల్లోనే నలుగుతున్న లక్ష్యం!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నర్సరీల్లోనే నలుగుతున్న లక్ష్యం!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వన మహోత్సవం కోసం ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో 60 శాతం వరకు బెడ్లు మొక్కలు లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసినా సకాలంలో నీటి నిర్వహణ, పర్యవేక్షణ లేక మొక్కలు మొలకెత్తకపోవడంతో 25 లక్షల మొక్కల నాటే లక్ష్యంపై ప్రభావం పడుతోంది. 

నర్సరీల నిర్వహణలో జీపీలు, సంబంధిత సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే తనిఖీలు నిర్వహించి లక్ష్యానికి అనుగుణంగా మొక్కల పెంపకం, ప్లాంటేషన్ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 
- జయశంకర్​భూపాలపల్లి, వెలుగు