కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ లో టికెట్ కలెక్టర్ చేసిన నిర్వాకం వైరల్ గా మారింది. తక్కువ ధరకే టికెట్ ఇస్తానని.. సీటు ఏర్పాటు చేస్తానని టీటీ ఆఫర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీంతో సదరు టీటీని రైల్వే అధికారులు బుధవారం (మే 13) సస్పెండ్ చేశారు.
రూ.700 టికెట్ రూ.380 కు ఏర్పాటు చేస్తానని.. తక్కువ ధరకే సీటు ఏర్పాటు చేస్తానని ఆఫర్ చేసిన వీడియో సోసల్ మీడియాలో ఫుల్ గా సర్క్యులేట్ అయ్యింది. దీంతో సదరు టికెట్ కలెక్టర్ ను సస్పెండ్ చేశారు రైల్వే అధికారులు.
టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకుడికి టికెట్ కేటాయింపు జరగకపోవడంతో.. నేను ఏర్పాటు చేస్తాను. తక్కువ ధరకే.. రూ.380 రూపాయలు ఇస్తే ఏర్పాటు చేస్తానని చెప్పిన వీడియో ఎక్స్ లో వైరల్ గా మారింది.
►ALSO READ | మళ్లీ 2012-13 లాంటి సంక్షోభం: డీకోడ్ చేసిన జెఫరీస్.. మోడీ మాటల వెనుక ఏం దాగి ఉందంటే..?
వందే భారత్ రైళ్లలో జరుగుతున్న అవినీతి ని కట్టడి చేయాల్సిందిగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన టీటీప కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైళ్లలో ఆన్ బోర్డులో టికెట్లు కేటాయించడం, అమ్మడం రైల్వే నిబంధనల ప్రకారం నేరం. ఈ క్రమంలో ఈ కార్యకలాపాలకు పాల్పడిన టీటీని సస్పెండ్ చేశారు అధికారులు.
Vande Bharat ₹750 ticket was being arranged by the TTE for just ₹380.⁰
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2026
This guy records it and made it viral😭 pic.twitter.com/hjHH35rPAC
