హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఏఓఏటీ)డిమాండ్ చేసింది. శుక్రవారం వీఏఓఏటీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి పి.అంజయ్య ఆధ్వర్యంలో ప్రతినిధులు హెచ్ఆర్డీ డైరెక్టర్ కుమార్ రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉద్యోగుల సంక్షేమం, కెరీర్ అభివృద్ధి, పెండింగ్ సమస్యల పరిష్కారాలకు సహకారం అందించాలని కోరారు. అంజయ్య మాట్లాడుతూ.. ఇటీవల జనరేషన్ కంపెనీలో ఇన్‌చార్జి ప్రమోషన్లు మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ కావడంతో అకౌంట్స్ విభాగం అధికారులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. డైరెక్టర్ కుమార్ రాజాకి బొకే అందజేసి శాలువాతో సన్మానించారు.
