
పద్మారావునగర్, వెలుగు: అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ పి.శంకర్ తెలిపిన ప్రకారం.. రాంనగర్గుండుకు చెందిన సంతోష్ శాస్త్రి అనాథ యువతి లక్ష్మి(35)ని గత మే 9న పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేకపోవడంతో కొంపల్లె లోని సురేశ్అనే వ్యక్తి తల్లికి కేర్‌టేకర్‌గా పనిచేస్తుంది. అక్కడ ఉండే యువతిని సంతోష్ శాస్త్రి పెళ్లిచేసుకోగా కట్నం ఇవ్వకపోవడంతో పెళ్లికి ఖర్చులు అయ్యాయని భర్త, అత్తింటివారు లక్ష్మిని వేధిస్తున్నారు. దీంతో భరించలేక ఆమె ఆదివారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.