V6 News

కుల ప్రభావాన్ని చూపించే ‘క్యాస్ట్‌‌’

కుల ప్రభావాన్ని చూపించే ‘క్యాస్ట్‌‌’

వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఏకే జంపన్న   దర్శకత్వంలో తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘క్యాస్ట్’.   కశికా కపూర్, దివి హీరోయిన్స్‌‌. గురువారం గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. 

వరుణ్ సందేశ్​ మాట్లాడుతూ ‘2007లో నటించిన ‘హ్యాపీ డేస్’ తర్వాత మళ్లీ ఇప్పుడు  నలుగురితో కలిసి  సినిమా చేశా.  ఆలోచిస్తుంటే చాలా క్రేజీగా అనిపిస్తోంది.  ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది.  ఇందులో ప్రతి క్యారెక్టర్‌‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇందులోని  పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని అన్నాడు. సెన్సిటివ్ పాయింట్‌‌తో ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతోందని సత్యం రాజేష్​ అన్నాడు. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టామని గగన్ బాబు, రవి అన్నారు.  

కులం అనేది  మన నిత్యజీవితంలో ఎలా ప్రభావం చూపుతుందో ఇందులో చూపించబోతున్నాం అని డైరెక్టర్ ఏకే జంపన్న చెప్పాడు. జూన్‌‌లో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నామని నిర్మాత కోటేశ్వరరావు అన్నారు.