జూన్ 9 మెగా బిగ్ డే : వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?

జూన్ 9 మెగా బిగ్ డే : వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్?

వరుణ్ తేజ్(Varun tej), లావణ్య త్రిపాఠి(Lavanya tripati)ల పెళ్లి గురించి కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కొందరు ఈ వార్తలు నిజమని, మరికొందరు అబద్దమని చెబుతున్నారు. తాజాగా ఈ జంట పెళ్లి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది. 

అదేంటంటే, వరుణ్, లావణ్య ల ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయ్యిందట. జూన్ 9న ఈ ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరగనుందని సమాచారాం. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు.. అతి కొద్దీ మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నారట. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని టాక్. ఇక మిస్టర్ సినిమాతో తెరపై మొదటిసారి జంటగా కనిపించిన ఈ జంట.. ఆ తరువాత అంతరిక్షం అనే సినిమాలో కూడా కలిసి నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను అటు మెగా ఫ్యామిలీ గానీ, ఇటు లావణ్య తరుపున వారు కానీ ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ న్యూస్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టైలీష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో గాండీవదారి అర్జున అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.