రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి ఏంటో.. అమెజాన్ ప్రైమ్లో ‘మట్కా’.. రిలీజ్ డేట్ ఇదే..

రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి ఏంటో.. అమెజాన్ ప్రైమ్లో ‘మట్కా’.. రిలీజ్ డేట్ ఇదే..

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘మట్కా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. నవంబర్ 14, 2024న విడుదలైన మట్కా సినిమా డిసెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన చేసింది.

డిసెంబర్ 5 నుంచి అమెజాన్ ప్రైమ్లో ‘మట్కా’ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంచుతున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ట్వీ్ట్ చేసింది. ‘పలాస 1978’ సినిమా దర్శకుడు కరుణ కుమార్ ‘మట్కా’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఒక గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఈ ‘మట్కా’ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.

వరుణ్ తేజ్ మూడు కోణాల్లో సాగే పాత్రలో ఆకట్టుకున్నప్పటికీ కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకుల ఆదరణను సంపాదించలేకపోయింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ‘మట్కా’ ఇంచుమించు రూ.3 కోట్ల కలెక్షన్లు మాత్రమే సాధించి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఫస్ట్ డే కలెక్షన్లు కనీసం 80 లక్షలు కూడా రాలేదని టాలీవుడ్ సర్కిల్స్లో టాక్ ఉంది.

ALSO READ : Pushpa2 Movie: గెట్ రెడీ ఫాన్స్.. పుష్ప 2 టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?

2022 నుంచి వరుణ్ తేజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేదు ఫలితాన్నే చవిచూస్తున్నాయి. గని (2022), గాండీవధారి అర్జున (2023), ఆపరేషన్ వాలంటైన్ (2024), మట్కా (2024).. ఇలా వరుస డిజాస్టర్లు ఈ మెగా హీరోను వెంటాడాయి. రొటీన్కు భిన్నంగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నప్పటికీ వరుణ్కు కాలం కలిసిరావడం లేదు.