
ఖైరతాబాద్, వెలుగు : భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వీధి పళ్లెం మహోత్సవాలు డిసెంబరు 14 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్టు సినీనటుడు తనికెళ్ల భరణి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భద్రకాళి సమేత వీర
భద్ర ఆరాధ్య జనసేవా వాహిని ట్రస్ట్ఆధ్వర్యంలో 4 రోజుల కార్యక్రమం భారీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆయా రోజుల్లో భక్తులకు భోజన సౌకర్యం ఉంటుందన్నారు. జనసేవా వాహిని ట్రస్ట్ చైర్మన్ తాడికొండ విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్ట్ ఐఏఎస్ ముక్తేశ్వరరావు, బంగారయ్య శర్మ, కైలాశ్, సుధాకర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు.