టమాటాకు బదులు ఈ వెజిటేబుల్స్ కూడా వాడుకోవచ్చు.. అదే టేస్ట్ వస్తుంది..

టమాటాకు బదులు ఈ వెజిటేబుల్స్ కూడా వాడుకోవచ్చు.. అదే టేస్ట్ వస్తుంది..

వంట చేస్తున్నామంటే దాదాపు అన్ని వంటల్లో టమాటా కావాల్సిందే.. కూరలు, గ్రేవీలకు టమాటా లేనిదే రుచి రాదు. అయితే టమాటాకు బదులు కొన్ని వెజిటేబుల్స్ ను కూడా  ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు, అవి వేసుకుంటే సేమ్ టమాటా వేసుకున్న టేస్టే వస్తుంది అవేంటో ఉప్పుడు చూద్దాం.

రెడ్ క్యాప్సికమ్స్..

రెడ్ క్యాప్సికమ్స్.. టొమాటోకు మంచి ఆల్టర్ నేటివ్ వెజిటబుల్. దీన్ని కూరల్లో వాడటం వల్ల రుచి, రంగు వస్తాయి. రెడ్ క్యాప్సికమ్స్ కూడా టొమాటోల లాంటివే (నైట్ షేడ్ వెజిటబుల్ కాబట్టి మరీ ఎక్కువ వాడొద్దు. ఈ క్యాప్సికమ్స్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అలాగే మెటబాలిజం రేట్ లని కూడా పెంచుతుంది. సో! దీని ద్వారా టొమాటో లేదనే ఫీలింగు కొంత వరకు తగ్గించుకోవచ్చు. 

సొరకాయ..

ఎవరి పెరట్లోనైనా పండే వెజిటబుల్స్ సొరకాయ ఒకటి. సొరకాయ ఉందంటే దానికి తోడు టొమాటో ఉండాల్సిందే. అంటారు చాలామంది. కానీ టొమాటో లేకుండానే వండాలంటే ఉసిరి, చింతపండు. కాంబినేషన్ కూర వండితే టొమాటో మచ్చుకైనా గుర్తురాదు. దీంతోపాటు సొరకాయ పప్పులో చింతపండు మిక్స్ చేసి, వేడి అన్నంలో మ్యాంగో పికిల్ వేసుకొని తింటే.. టొమాటో టేస్ట్ మీదికి మన సెందుకుమళ్లుతుంది.

చింతపండు..

చింత లేని ఇల్లు, చింతపండు లేని వంటిల్లు ఉండదు. అందరికీ అందుబాటులో ఉండే చింతపండును కూరల్లో వేయడానికి అంతగా ఇబ్బందేమీ ఉండదు. ఈ చింత పండును మోతాదుగా వాడటం వల్ల టొమాటో రుచి తీపి.. కూరల్లో యాడ్ అవుతుంది. వేడి వేడి అన్నం, అప్పుడే వండిన కూరలో ఉండే చింతపండు రుచి నాలుకకు తగిలితే టొమాటో లేదనే చింత ఉంటుందా!

ఉసిరి..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. ఇప్పుడు ఆ ఉల్లితో పాటే ఉసిరి కూడా మేలు చేస్తానంటోంది. ఆకుపచ్చ రంగులో ఉండే వీటిని ఇండియన్ గ్రీన్ టొమాటోస్ అని కూడా పిలుస్తారు. పేరులోనే టొమాటో ఉన్న తర్వాత తినడానికి ఆలోచన ఎందుకు? టొమాటోతో కూరకు అందే రుచిని ఏమాత్రం తగ్గించకుండా అందిస్తుంది ఉసిరి. కూరకు ఒగరును, పులుపునే కాదు.. తిన్నవాళ్లకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఉసిరిలో విటమిన్-సి ఉంటుంది. ఇది లివర్ హెల్త్ ని కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ను, హార్ట్ హెల్తు, జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.

పెరుగు.. 

ఆదివారం వస్తే చాలు ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు చాలామంది. కానీ ఆ ముక్క తిన్న తర్వాత పెరుగు లేకపోతే అసలు తిన్న ఫీలింగే ఉండదు. అలాంటి పెరుగును ఈ టైంలో యూజ్ చేసుకోవాలి. ఏ కర్రీ వండినా కూడా దాన్ని పెరుగుతో మారినేట్ చేయొచ్చు. ఇది నాన్వెజ్కు అయినా, వెజ్ కు అయినా రుచిని, చిక్కదనాన్ని ఇస్తుంది. కూరలో పులుపును పెంచి టొమాటో లేదనే ఫీలింగ్ ను మరిపిస్తుంది. వీటితో పాటు పచ్చి మామిడి కాయలు కూడా వాడొచ్చు.. కానీ ఈ సీజన్లో దొరకదు కాబట్టి ఆమ్ చూర్ కూరల్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.