
రాష్ట్రంలో ఆపదలో ఉన్న బాలలను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక బాలరక్షక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 33 జిల్లాలకు బాలరక్షక్ వాహనాలను మంత్రి సత్యవతి ప్రారంభించారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేసీఆర్ సలహాతోనే ఈ కార్యక్రమం సాధ్యమైందన్న ఆమె.. పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.