వెలుగు క్రికెట్ టోర్నమెంట్ థీమ్ సాంగ్ విడుదల

వెలుగు క్రికెట్ టోర్నమెంట్ థీమ్ సాంగ్ విడుదల

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘వెలుగు క్రికెట్ టోర్నమెంట్’ కు క్రికెట్ అభిమానులనుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గ్రామీణ ఆటగాళ్లలో ప్రతిభను వెలికితీసేందుకు వెలుగు దినపత్రిక ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్ థీమ్ సాంగ్ ను నిర్వాహకులు విడుదల చేశారు. తెలంగాణ పదాలతో… ఊపునిచ్చే ట్యూన్ తో పాట ఆకట్టుకుంటోంది.

“ధూమ్ ధామ్ గల్లీల… పోరగాళ్ల లొల్లి ఇగ..

ఫోర్ సిక్సుల మోత మోగె వెలుగు టోర్నమెంటుల

బౌన్సర్ ఏసినా… గుబులు పడడు ఎవడు ఈడ

ఫుల్ షాట్ కొట్టిర్రంటే ఏక్ దో తీన్ చార్ సీదా

ఏస్కో తీన్ మార్.. బిడ్డా బౌలర్ సక్కగైతడు

ఎయ్యడింక తలమీదా.. ఏస్తే ఆగమైతడు…

యువీ లెక్క ఆడితే ఆల్లైతరు స్టువార్ట్ బ్రాడ్

ఆన్ ద స్పాట్.. వ్యూహమెయ్యి గుబులుపడకు..

వెలుగు దినపత్రికే అందించిందీ టోర్నమెంట్

ఆడెయ్ గెలుపు కోసమే వీ6 వెలుగు టోర్నమెంట్” అంటూ సాగే ఈ పాటను మీరూ ఓసారి విని ఆనందించండి.