వేములవాడ భీమేశ్వరస్వామి  33 రోజుల ..హుండీ ఆదాయం రూ.2.16 కోట్లు

వేములవాడ భీమేశ్వరస్వామి  33 రోజుల ..హుండీ ఆదాయం రూ.2.16 కోట్లు

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వర స్వామి ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 33 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన హుండీలను లెక్కించగా రూ.2,16,65,140 నగదు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే 161 గ్రాముల బంగారం, 10 కిలోల 900 గ్రాముల వెండి కూడా సమకూరింది. ఆలయ ఈఓ రమాదేవి, కరీంనగర్ ఏసీ కార్యాలయానికి చెందిన రాజమౌళి పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.