రాజన్న గుడికి రూ.1.43 కోట్ల ఇన్కం..    మహాశివరాత్రి ఉత్సవాలకు 2.59 లక్షల భక్తుల రాక

రాజన్న గుడికి రూ.1.43 కోట్ల ఇన్కం..    మహాశివరాత్రి ఉత్సవాలకు 2.59 లక్షల భక్తుల రాక

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర వైభవంగా ముగిసింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్‌‌గఢ్‌‌ తదితర రాష్ట్రాల నుంచి మొత్తం 2,59,598 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మూడు రోజుల జాతరలో స్వామివారికి మొత్తం రూ.1 కోటి 43 లక్షల 91 వేల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.40.04 లక్షలు, కోడె మొక్కుల ద్వారా రూ.41.89 లక్షలు, తలనీలాల సమర్పణ ద్వారా రూ.3.34 లక్షలు, అతి శీఘ్ర దర్శనం ద్వారా రూ.5.57 లక్షలు, బద్దిపోచమ్మ ఆలయం ద్వారా రూ.1.34 లక్షలు, ఇతర మార్గాల ద్వారా రూ.51.72 లక్షల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. జాతర విజయవంతం కావడంతో ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈవో రమాదేవిని 
సన్మానించారు.