గండిపేట, వెలుగు: తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. నార్సింగి సర్కిల్ మణికొండ 127, 128 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్, కిరణ్‌కుమార్, షేక్ హాజీ, శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
