ప్రభుత్వాసుపత్రుల్లోని సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి : వెంకటేశ్వర రెడ్డి

ప్రభుత్వాసుపత్రుల్లోని సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి : వెంకటేశ్వర రెడ్డి

పద్మారావునగర్, వెలుగు: ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఐఎన్ టీయూసీ స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గాంధీ ఆస్పత్రి పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యవర్గం బుధవారం ఏర్పాటైంది. ఐఎన్ టీయూసీ గాంధీ విభాగం అధ్యక్షుడిగా ఎం. శివకుమార్, జనరల్ సెక్రటరీగా రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్​గా వెంకటరత్నం, ట్రెజరర్​గా అంజయ్య, అనురాధ మాలతి ఎన్నికయ్యారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పేషెంట్ కేర్, శానిటేషన్, ఇతర విభాగాల సిబ్బందికి ప్రతి నెలా జీతాలను చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జీతాలతో పాటు సిబ్బందికి పీఎఫ్​, ఈఎస్ఐ జమ చేయాలని, పే స్లిప్పులు కూడా ఇవ్వాలన్నారు. ప్రతి నెలా మూడ్రోజులు సెలవులు ఇవ్వాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగరాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ప్రమీల, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కె. వేణుగోపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.​