మానవ సంబంధాలే ప్రధాన ఇతివృత్తంగా.. వెంకట్రామయ్య గారి తాలూకా

మానవ సంబంధాలే ప్రధాన ఇతివృత్తంగా.. వెంకట్రామయ్య గారి తాలూకా

దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా   సతీష్ ఆవాల దర్శకత్వంలో   కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి  నిర్మిస్తున్న  చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.   ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సతీష్​ మాట్లాడుతూ ‘ మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా  మారిపోయాయని చూపించే చిత్రమిది. తల్లి తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసేలా ఉంటుంది’ అని చెప్పాడు.  

త్వరలోనే మరిన్ని అప్‌‌‌‌డేట్స్ అందిస్తామని నిర్మాతలు తెలియజేశారు.  మురళీధర్ గౌడ్, సుధ, కాశీ విశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.