వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ చిత్రం రూపొందబోతున్న విషయం తెలిసిందే. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే ఆసక్తి రేపుతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ గురువారం ఉదయం ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
కీర్తి సురేష్, కృతి శెట్టి ఇందులో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు సమర్పిస్తున్నాయి. హీరోహీరోయిన్స్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు ఫస్ట్ షాట్‌కు డైరెక్షన్ చేశారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ స్క్రిప్ట్‌ను దర్శకనిర్మాతలకు అందజేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
