
వేణు తొట్టెంపూడి, అవంతిక మిశ్రా, సియా గౌతమ్ లీడ్ రోల్స్‌లో భరత్ వైజీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘అతిథి’. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 19 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో వేణు మాట్లాడుతూ ‘ఒక సినిమా రన్ టైమ్‌లో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఒకసారి చూడటం స్టార్ట్ చేస్తే కంటిన్యూగా చూస్తారు. అంత గ్రిప్పింగ్‌గా ఉంటుంది.
ఒక్క ఎపిసోడ్ మిస్సయినా ట్విస్ట్ మిస్సవుతారు. చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవకుండా భరత్ తెరకెక్కించాడు’ అని చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘వేణు గారు ఒక కొత్త యాక్టర్‌లా ఈ వెబ్ సిరీస్‌లో నటించారు. ఇందులో హారర్, థ్రిల్లర్ అంశాలుంటాయి. ప్రతి ఎపిసోడ్ ట్విస్టులతో సాగుతుంది. ఫ్యామిలీ అంతా చూసే వెబ్ సిరీస్ ఇది’ అన్నాడు. నటీనటులు అవంతిక మిశ్రా, సియా గౌతమ్, రవివర్మ, వెంకీ కాకుమాను, డీవోపీ మనోజ్, మ్యూజిక్ డైరెక్టర్ కపిల్ తదితరులు పాల్గొన్నారు.