
ఇండోర్ : టెస్ట్ క్రికెట్‌లో వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ప్రస్తుతం చాలా తక్కువ మంది ఉన్నారని, లాంగ్‌ఫార్మాట్ ఆదరణపై అది ప్రభావం చూపుతోందని లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ‘వరల్డ్‌క్లాస్ బౌలర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో అభిమానులు ఆశించే నువ్వా నేనా అనే పోరుకు ఆస్కారం లేకుండా పోయింది. ఫాస్ట్ బౌలింగ్ క్వాలిటీ మరింత మెరుగుపడాలి. ప్రస్తుతం అందిస్తున్న పిచ్‌ల వల్ల టెస్ట్ మ్యాచ్‌లు చప్పగా సాగి క్రికెట్ స్టాండర్డ్‌ను దెబ్బతీస్తున్నాయి. పేసర్లకు, స్పిన్నర్లకు సమానంగా సహకరించేలా పిచ్‌లు రూపొందిస్తే ఆట రసవత్తరంగా సాగుతుంది. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్ చూస్తే అది అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలోనే అత్యుత్తమ పిచ్‌లను ఆ సిరీస్‌కు రెడీ చేశారు‘ అని అన్నాడు.