ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలి వీహెచ్పీ డిమాండ్

ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలి వీహెచ్పీ డిమాండ్

న్యూఢిల్లీ: ఢిల్లీ పేరును ‘‘ఇంద్రప్రస్థ’’గా మార్చాలని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌‌‌‌పీ) డిమాండ్ చేసింది. రాజధానిని దాని పురాతన చరిత్ర, సంస్కృతితో అనుసంధానం చేయాలని పేర్కొంది. ఈమేరకు వీహెచ్‌‌‌‌పీ ఢిల్లీ యూనిట్ ఆదివారం ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రాకు లేఖ రాసింది. 

ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్​ను ఇంద్రప్రస్థ అంతర్జాతీయ విమానాశ్రయంగా, ఢిల్లీ రైల్వే స్టేషన్​ను ఇంద్రప్రస్థ రైల్వే స్టేషన్‌‌‌‌గా, షాజహానాబాద్ డెవలప్‌‌‌‌మెంట్ బోర్డ్‌‌‌‌ను ఇంద్రప్రస్థ డెవలప్‌‌‌‌మెంట్ బోర్డ్‌‌‌‌గా పేరు మార్చాలని లేఖలో డిమాండ్ చేసింది. 

‘‘పేర్లు కేవలం మార్పులను మాత్రమే కాదు.. అవి ఒక దేశం స్పృహను ప్రతిబింబిస్తాయి. మనం ఢిల్లీ అని పలికినప్పుడు కేవలం 2 వేల సంవత్సరాల చరిత్రను మాత్రమే చూస్తాం. కానీ, ఇంద్రప్రస్థ అని పలికితే 5 వేల ఏండ్ల వైభవమైన చరిత్రతో అనుసంధానం అవుతాం" అని పేర్కొంది.