
కరోనా తీవ్రతకు కారకులైన వారి ఉత్సవాలను అడ్డుకోలేని ప్రభుత్వం.. గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటుందని విశ్వహిందూ పరిషత్ ప్రెసిడెంట్ రామరాజు అన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను ఎతెస్తూ వస్తోందని ఆయన అన్నారు. ‘కరోనా కేసులు పెరగడానికి కారణమైన వారి పండుగలను అడ్డుకోలేని ప్రభుత్వం.. హిందువులు వైభంగా జరుపుకునే గణేష్ ఉత్సవాలను అడ్డుకుంటోంది. అయినా సరే గణేష్ భక్తులు.. పోలీసులు దమన కాండను ఎదిరిస్తూ పూజలు చేశారు. కేసీఆర్ కాశిం నజ్రీగా మారిపోయారు. కోర్ట్ ఆర్డర్ పేరుతో ఉత్సవాలను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆయన అన్నారు.
పండగకు ముందు గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.. ఇప్పుడేమో కోర్టు పేరుతో పూజలు చేయకుండా అడ్డుకుంటున్నారని గణేష్ ఉత్సవ కమిటీ సెక్రటరీ భగవంత్ రావు అన్నారు. ‘ప్రభుత్వం చెప్పక ముందే కరోనా నేపథ్యంలో ఆర్భాటాలు లేకుండా నిమజ్జనం చేయాలని నిర్ణయించాం. పోలీసులు గణేష్ మండపాలు పెట్టకుండా భక్తలను బెదిరించారు. పెట్టిన వాళ్ళను తొందరగా తీయాలని బెదిరిస్తున్నారు. రంజాన్, బక్రీద్ సమయంలో పోలీసులు ఎలా రక్షణ కల్పించారో… హిందువుల పండగలకు కూడా అలాగే రక్షణ కల్పించాలి. గణేష్ ఉత్సవాలను అడ్డుకునేందుకు కేసీఆర్.. పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారు. గ్రామాల్లో గణేష్ విగ్రహాలు పెట్టొద్దని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారు. కేసీఆర్ మెప్పు కోసం పాలకులు గణేష్ మండపాలు పెట్టకుండా చేస్తున్నారు. వినాయక ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. కేసీఆర్, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చాం. సోమవారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ నిరసన కార్యక్రమాలుంటాయి. పోలీసులు పాలకులకు తొత్తులుగా కాకుండా రాజ్యాంగ బద్దంగా పని చేయాలి’అని ఆయన అన్నారు.
For More News..