మళ్లీ ధర్నా షురూ చేసిన మేడిగడ్డ ముంపు బాధితులు

మళ్లీ ధర్నా షురూ  చేసిన మేడిగడ్డ ముంపు బాధితులు

మహదేవపూర్, వెలుగు: మహారాష్ట్రలోని మేడిగడ్డ ముంపు బాధితులు మళ్లీ ధర్నా షురూ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యాక్ వాటర్ తో మూడేండ్లుగా పంటలు మునుగుతున్నాయని, తమ పొలాలు తీసుకుని ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలంటూ మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలోని 30 గ్రామాల ప్రజలు 25 రోజుల ధర్నా చేస్తున్నారు. గత వారం పీఎల్జీ వారోత్సవాల సందర్భంగా ఆందోళనకు విరామం ఇచ్చారు. 

ఆదివారం అర్ధ నగ్నంగా భిక్షాటన చేసి ఆందోళనను తిరిగి ప్రారంభించారు. తమ భూములను ఆగం జేసిన తెలంగాణ సీఎం బీఆర్ఎస్ తో దేశ రైతులను ఆదుకుంటామని అంటున్నారని, ఈ మాటలు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ముందు మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ తో ముంపునకు గురవుతున్న తమకు నష్టపరిహారం ఇచ్చినంక  దేశ రైతుల గురించి మాట్లాడాలని మండిపడ్డారు.తమకు న్యాయం జరిగేవరకు నిరసన ఆపేది లేదని తేల్చిచెప్పారు.