నదిలో మునిగిన బస్సు.. డ్రైవర్, కండక్టర్ మృతి

నదిలో మునిగిన బస్సు.. డ్రైవర్, కండక్టర్ మృతి

కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నదిలో బస్సు మునిగి ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట తెగిపోయింది. దాంతో చెయ్యేరు నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో నది పక్కగా వెళ్తున్న బస్సు నీట మునిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్‎తో పాటు ఓ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరికొంతమంది ప్రయాణికులు బస్సు టాప్ ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద దాటికి 30 ఏళ్ల నాటి చెయ్యేరు డ్యామ్ కొట్టుకుపోయింది. దాంతో ఒక్కసారిగా పెరిగిన వరద ప్రవాహంలో 16 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. 

 

కాగా.. వరద ఉధృతి తగ్గిన తర్వాత కూడా ప్రయాణికులు బస్సు టాప్ మీదనే ఉండటం గమనార్హం. అధికారులు వచ్చి తమను కాపాడకపోతారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.