కరోనా టెస్ట్ వద్దన్నారని యువకులను చితకబాదిన సిబ్బంది

కరోనా టెస్ట్ వద్దన్నారని  యువకులను చితకబాదిన సిబ్బంది

వ్యాక్సిన్ సెంటర్ అనుకుని కరోనా టెస్టు సెంటర్ కు వచ్చిన ఇద్దరు యువకులపై బెంగళూరు మహానగర పాలక సంస్థ సిబ్బంది దాడి చేశారు. నాగరత్ పేట టెస్టింగ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. అక్కడ వ్యాక్సిన్ ఇస్తున్నారని తప్పుగా భావించి ఇద్దరు యువకులు చాలా సేపు లైన్ లో నిలుచున్నారు. ఐతే చాలా సేపు క్యూలో నిలుచున్న తర్వాత అది టెస్టింగ్ సెంటర్ అని తెలియడంతో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అంతసేపు క్యూలో నిలుచుండి వెనక్కి వెళ్తున్న వీరిద్దరిని గమనించిన సిబ్బంది తప్పనిసరిగా కరోనా టెస్టు చేసుకోవాలని సూచించారు. ఐతే టెస్టు చేసుకునేందుకు వారిద్దరూ నిరాకరించారు.దీంతో వారిద్దరిని టెస్టింగ్ సెంటర్ దగ్గరకు బలవంతంగా లాక్కెళ్లారు BBMC సిబ్బంది. టెస్టు చేసుకునేందుకు ఒప్పుకోకపోవడంపై ఇద్దరు యువకులపై దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో BBMC సిబ్బందిపై కేసు నమోదు చేశారు.