వైరల్ వీడియో: వాలీబాల్ ఆడుతున్న పక్షులు

వైరల్ వీడియో: వాలీబాల్ ఆడుతున్న పక్షులు

రెండు జట్లుగా ఏర్పడి మ్యాచ్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్ టైన్ మెంట్ కు వీలు లేక అందరూ మొహం వాచిపోయి ఉన్నారు. సినిమాలు.. కామెడీ… క్రీడా పోటీలు.. తదితర రంగాల్లో ఎంటర్ టైన్ మెంట్ ఫుల్ గా మిస్సయిపోయిన వారంతా సోషల్ మీడియాలో నిరంతరం ఆన్ లైన్ లో మునిగి తేలుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆటలన్నీ తిరిగి మొదలవుతున్నా.. సోషల్ మీడియాను వీడడం లేదు. సంభ్రమాశ్చర్యాలు కలిగించే వీడియోలు కొంత కాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేసిన చిన్న చిన్న పక్షుల వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పసుపు, పచ్చ రంగుల్లో ఉన్న పక్షులు రెండు జట్లుగా విడిపోయి వాలిబాల్‌ ఆడుతున్న ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు జట్ల పక్షులు ముక్కుతో బాల్‌ను కరుచుకుని ఆటు ఇటూ నెట్‌పై నుంచి తోస్తున్నాయి. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఈ పక్షులు పసుపు, పచ్చ జట్లుగా విడిపోయి ఆడుతున్న తీరు ముచ్చట కలిగిస్తుంది.

ఎల్లో పక్షి బాల్‌ను గ్రీన్‌ పక్షుల వైపు వేస్తుంటే ఓ గ్రీన్‌ పక్షి ఎల్లో పక్షివైపే నెడుతూ చీటింగ్‌ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను తెగ చూసేస్తున్న నెటిజనులు రకరకాల కామెంట్లతో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఆటల పోటీలన్నీ రద్దయి పోయాయి.. కానీ ఈ బార్డీబాల్‌ మాత్రం కాదు’ అనే ఫన్ని ట్యాగ్ లైన్ తో షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్‌ వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. ఈ పపుసు మరియు పచ్చ జట్లలో ఏ టీమ్ గెలుస్తుంది ? అని అడిగిన ప్రశ్నకు నెటిజనులు‌ బాగా స్పందిస్తున్నారు. పచ్చ జట్టు గెలుస్తుందని ఒకరంటే.. ఆ టీమ్ మోసం చేస్తోంది అంటూ మరికొందరు.. అసలు ఈ పక్షలను చూడండి ఎంత ముద్దొస్తున్నాయో.. వాటిని మా పిల్లల దగ్గరకు తీసుకెళ్లాలనిపిస్తోంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.