
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి దేశ వ్యాప్తంగా వివాదం జరగుతున్న సంగతి తెలిసిందే.. రోజుకొకరు తమ జీవితంలో జరిగిన అనుభవాలను అందరి ముందు చెప్పుకుంటున్నారు. చాలా మంది హీరోయిన్లు, ఆర్టిస్టులు ఇప్పటికే తమను నమ్మించి మోసం చేశారని తమ ఆవేదనను బయట పెట్టారు. లేటెస్ట్ గా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ మిషన్ మంగళ్ సినిమా ప్రమోషన్ లో సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టింది. తన పట్ల ఒక సౌత్ డైరెక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. చెన్నైలో ఉన్నప్పుడు తనను కలవడానికి వచ్చిన ఓ డైరెక్టర్ రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందామని తీసుకెళ్లాక అతను అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. అసలు తనది హీరోయిన్ మోహమేనా అని ఓ ప్రొడ్యూసర్ అన్నాడని చెప్పింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తాను ఎప్పుడు ఎవరికీ లొంగలేదని చెప్పింది.