పెళ్లి రోజు విఘ్నేష్ ఆసక్తికర పోస్ట్...

పెళ్లి రోజు విఘ్నేష్ ఆసక్తికర పోస్ట్...

కోలీవుడ్ స్టార్స్ నయనతార - విఘ్నేష్ శివన్ వివాహాం ఈ రోజు ఉదయం చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ స్టార్ కపుల్ ను ఆశీర్వదించేందుకు పలువురు అతిథులు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే పెళ్లికి కొన్ని గంటల సమయానికి ముందు విఘ్నేష్ చేసి పోస్ట్.. ఇప్పుడు వైరల్ గా మారింది. “ఈ రోజు జూన్ 9వ తేదీ. ఇది నయన్ దే. నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన భగవంతుడికి, ఈ విశ్వానికి, నా జీవితంలో మంచి మనుషులందరికీ.. ప్రతి ఒక్క మంచి మనసుకు, ప్రతి ఒక్కరి ఆశీర్వాదానికి, షూటింగ్ లో ప్రతి రోజుకూ థ్యాంక్యూ. మీ ప్రార్థనలకు రుణపడి ఉంటాను. ఇప్పుడు ఇదంతా లవ్ ఆఫ్ మై లైఫ్. నయన తారకు అంకితం ఇస్తున్నా. ” అనే క్యాప్షన్ ను విఘ్నేష్  జత చేశారు.