విజయ్ ఆంటోనీ లీడ్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. ము.మారన్ దర్శకత్వంలో మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. రామంజనేయులు జవ్వాజీ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దీపావళికి సందర్భంగా నవంబర్ 6న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తోపాటు ఇంటెన్స్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని మేకర్స్ అన్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ ముఖ్య పాత్రల్ని పోషించారు. విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు.
