Vijay-Rashmika: విజయ్,రష్మిక జాడను పట్టించేసిన నెటిజన్..ఎలానో తెలుసా!

Vijay-Rashmika: విజయ్,రష్మిక జాడను పట్టించేసిన నెటిజన్..ఎలానో తెలుసా!

టాలీవుడ్​ ట్రెండింగ్​ జంట విజయ్​ దేవరకొండ( Vijay Deverakonda),రష్మిక (RashmikaMandanna)మధ్య రిలేషన్ మరోసారి తెరపైకి వచ్చింది.అయితే వీరిద్దరి మధ్య వచ్చే రూమర్లు,ఇప్పుడు కొత్తగా వచ్చేవి కాదు.గీత గోవిందం మూవీ నుంచే మొదలయ్యాయి. ఈ సినిమాలో ఇద్దరూ జంటగా నటించారు.

గీత గోవిందం మూవీలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది.అప్పటి నుంచే వీళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రచారం జరిగింది.ఈ వార్తలను ఎప్పటికప్పుడు వాళ్లిద్దరూ ఖండిస్తూనే ఉన్నారు.అంతేకాకుండా..వీళ్ళిద్దరూ ఏదో ఒకచోట కలిసి కనిపిస్తూ ఉండడం, పండుగల సమయంలో రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం,ఓకే ప్లేస్ కి వెకేషన్ కి వెళ్లడం..ఇవన్నీ వీరి రిలేషన్ లో ఉన్నట్లు చూపిస్తున్నాయి. 

అయితే,ఇప్పుడు అసలు విషయానికి వస్తే..ప్రస్తుతం విజయ్ కొత్త సినిమా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజైన విషయం తెలిసిందే.ఇక అదేరోజు హీరోయిన్ రష్మిక పుట్టిన రోజు కూడా కావడం విశేషం.మార్నింగ్ షో దగ్గర నుంచి ఈవెనింగ్ షోస్ వరకు ఫ్యామిలీ స్టార్ టీమ్ థియేటర్లో సందడి చేయగా..విజయ్ మాత్రం అసలు కనిపించట్లేదు.అంతెందుకు సినిమా రిలీజ్ తరువాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా లేడు.దీంతో విజయ్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ షురూ అయింది. దీంతో ఓ నెటిజన్ మాత్రం విజయ్ జాడను పట్టించేశాడు.అదెలానో తెలుసా?

రష్మిక బర్త్ డే స్పెషల్ ఉండటంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం కోసం..విజయ్ అండ్ రష్మిక వెకేషన్కి వెళ్లారంటూ దుబాయ్ జాయేద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న ఓ ఇండియన్ తన సోషల్ మీడియాలో విజయ్ తో కలిసి దిగిన ఒక ఫొటోని షేర్ చేసాడు.

అంతేకాదు ఆ పిక్ కింద..“ఫొటో తీసింది శ్రీవల్లి” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మరోసారి ఈ జంటపై వచ్చిన రూమర్స్ కి  మరొక సాక్ష్యం దొరికింది. ఇంక్కేన్నాళ్ళు బాస్..తొందరగా ప్రకటించేయండీ..అంటూ కామెంట్స్ షురూ అయ్యాయి.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chandu Ignite (@the_ch4ndu)