Maharaja: మహారాజ కలెక్షన్స్ జోరు.. దుమ్ములేపుతున్న విజయ్ సేతుపతి

Maharaja: మహారాజ కలెక్షన్స్ జోరు.. దుమ్ములేపుతున్న విజయ్ సేతుపతి

తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మహారాజ. క్రైం అండ్ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను నిథిలన్‌ తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్ తో ఆసక్తిరేపిన ఈ సినిమా జూన్ 14న థియేటర్స్ లోకి వచ్చింది. ఇక ప్రేక్షకుల నుండి కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కథ రొటీన్ గా ఉన్నప్పటికి.. ప్రెజెంటేషన్ కొత్తగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులకి మైండ్ బ్లాక్ అవడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

రోజు రోజుకి పెరుగుతున్న పాజిటీవ్ టాక్ తో కలెక్షన్స్ కూడా అదరగొడుతోంది ఈ సినిమా. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.40కోట్లకు పైగానే గ్రాస్‌ రాబట్టి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది మహారాజ మూవీ. ఇక తెలుగులో చూసుకుంటే ఇప్పటివరకు రూ.10 కోట్ల వరకు కలెక్షన్స్‌ రాబట్టినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టాక్. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ గా నిలిచి విజయ్ సేతుపతికి మరో విజయాన్ని అందించింది.