ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ లో విజయ్‌ సేతుపతి

ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ లో విజయ్‌ సేతుపతి

సినీ ఇండిస్టీలో ముఖ్యంగా సౌత్‌ ఇండియాలో బయోపిక్‌ల జోరు ఊపందుకుంది. సినిమా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగంలో ప్రముఖుల జీవిత చరిత్రను డైరెక్టర్లు తెరకెక్కిస్తున్నారు. లేటెస్టుగా క్రికెట్‌ రంగానికి చెందిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను తెలిపారు డైరెక్టర్  ఎంఎస్ శ్రీపతి.

ముత్తయ్య మురళీధరన్‌ పాత్రలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి నటించనున్నాడని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌, డార్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

టెస్టుల్లో 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు పడగొట్టిన ఘనత ముత్తయ్య మురళీధరన్‌కు ఉంది. 2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడి తన రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. దీంతో ఈ సినిమాకు 800 అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌ శైలిని విజయ్‌ సేతుపతి ప్రాక్టీస్‌ చేయడం మొదలు పెట్టాడట.