- ప్రభుత్వ విప్ విజయరమణారావు
సుల్తానాబాద్/జూలపల్లి, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పారదర్శకంగా పెద్దపల్లి నియోజకవర్గంలో వడ్లు, మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో, జూలపల్లి మండలకేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో మక్కలు, వడ్ల కొనుగోలు సెంటర్లను సోమవారం ఆయన సందర్శించారు.
మక్కల కొనుగోళ్లలో జాప్యంపై రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అప్పటికప్పుడు ఆయన అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు చిలుక సతీశ్, అధికారులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
