పంజాగుట్ట, వెలుగు: గత బీఆర్ఎస్ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజా పాలనలో సరిచేస్తున్నమని, ఎర్రమంజిల్‌లో ఇండ్లు కొల్పోయిన వారికి సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో స్థలాలు కేటాయించడం హర్శణీయమని పీజేఆర్తనయ, ఖైరతాబాద్మాజీ కార్పొరేటర్విజయారెడ్డి అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లబ్ధిదారులతో కలిసి ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిమ్స్ దవాఖానకు అభివృద్ధి చేస్తామని ఎర్రమంజిల్ లోని కొంతమంది ఇండ్లను కూల్చివేశారని, అప్పటి నిర్వాసితుల్లో 9 మందికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్రమంజిల్ లోనే ఇండ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో విడుదల చేసిందన్నారు. ఇది ప్రజాపాలనకు అద్దం పడుతుందన్నారు.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా ఇంట్లో రోగులు ఉన్నా కనికరం లేకుండా పేదల ఇండ్లను నేలమట్టం చేసిందని, అప్పటి నుంచి తాము న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 9 మంది బాధితులకు ఎర్రమంజిల్ లోనే ఇండ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో విడుదల చేశారన్నారు. తస్లీమ్ బేగం, విజయలక్ష్మి, పాల్గొన్నారు.
