
ఏపీ సీఎం చంద్రబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ లపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. తన గొంతును డబ్బింగ్ చేసి… ఫేక్ ఆడియో సృష్టించి… తన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు ప్రసారం చేశారంటూ రాధాకృష్ణ పై ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.
విజయసాయి రెడ్డి తరపున వైఎస్సార్సీపీ పార్టీ స్టేట్ సెక్రటరీ, ఐటీ వింగ్ ప్రెసిడెంట్ చల్లా మధుసూదన్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు.
“ఈసారి పార్టీ అధికారంలోకి రాకపోతే వైసీపీ పని ముగిసినట్టే. చంద్రబాబు ఏదైనా మేనేజ్ చేయగల నిపుణుడు. ఇప్పుడు రాకపోతే మరెప్పుడూ పార్టీ అధికారంలోకి రాదు” అని ఇటీవల ఓ ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియోలో ఉన్న గొంతు విజయసాయిరెడ్డిదే అంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారు.