- మృతదేహాలను చూసిన కుటుంబసభ్యుడు గుండెపోటుతో మృతి
తాండూరు, వెలుగు: ఈత సరదా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోగా.. వారి మృతదేహాలను చూసిన మరో వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ముగ్గురి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
వికారాబాద్ జిల్లా పాత తాండూరుకు చెందిన మొహిజొద్దీన్(28), అతనికి వరుసకు బాబాయ్అయిన కోహీర్ప్రాంతానికి చెందిన రహమత్(26) ఆటోడ్రైవర్లు. బుధవారం బంధువుల ఫంక్షన్లో కలిసి, సాయంత్రం ఈత కొట్టేందుకు యాలాల్మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నా నదికి వెళ్లారు. నీటిలో దిగిన కాసేపటికే ఇద్దరూ మునిగిపోయారు.
పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి, గాలించగా మొహిజొద్దీన్మృతదేహం లభ్యమైంది. గురువారం మళ్లీ గాలించగా రహమత్డెడ్బాడీ దొరికింది. తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వీరి మృతదేహాలను చూసిన మొహిజొద్దీన్కు మేనమామ, రహమత్ కుబావ అయిన సాజిద్(46) గుండెపోటుతో మృతిచెందాడు. సాజిద్భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలుపారు.
