- పలుచోట్ల గంజాయి, మద్యం సీజ్
- మరోచోట తప్పిపోయిన బాలుడి గుర్తింపు
వికారాబాద్, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా వికారాబాద్పట్టణంలో డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో శనివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న ఒక వ్యక్తిని పట్టుకుని 2 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇందిరానగర్ కాలనీలోని ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 55 బీర్ బాటిళ్లు, 43 మద్యం సీసాలను సీజ్ చేశారు.
రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జీలను తనిఖీ చేస్తుండగా, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన రుక్మాపూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (15) అనే మైనర్ బాలుడిని పోలీసులు గుర్తించారు. అనంతరం తల్లిదండ్రులకు పిలిపించి బాలుడిని సురక్షితంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘు కుమార్, క్రైమ్ టీమ్, బ్లూకోల్ట్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
