పోలీస్ కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి నో ఛాన్స్.. అమ్మాయిని వేధించిన కేసున్నా.. ఈ పెద్ద మనిషికి లీగల్ సెల్ ఆఫీసర్ జాబ్ !

పోలీస్ కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి నో ఛాన్స్.. అమ్మాయిని వేధించిన కేసున్నా.. ఈ పెద్ద మనిషికి లీగల్ సెల్ ఆఫీసర్ జాబ్ !

పవర్ పాలిటిక్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పటానికి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ (ఉదాహరణ) ఇది. అంతేనా బంతిలో చివర ఉన్నా వడ్డించే వాడు మనోడు అయితే లోటు ఉండదు అనటానికి ఇదో ఉదాహరణ. రాజ్యం మనది అయితే ఏం చేసినా చెల్లుతుంది అనటానికి హర్యానా రాష్ట్రంలో జరిగిన ఘటన చూసి ఇప్పుడు దేశం మొత్తం నివ్వెరపోతుంది. ఔరా అని ముక్కున వేలేసుకుంది. ‘బేటీ పడావో బేటీ బచావో’ నినాదం చేస్తున్న బీజేపీ సర్కార్ నిర్వాకానికి మైండ్ బ్లాంక్ అవుతుంది. వ్యవస్థను నడిపించే IAS అధికారికే ఇలా అన్యాయం జరుగుతుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. హర్యానా బీజేపీ ఎంపీ సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలా ఢిల్లీలోని అడ్వకెట్ జనరల్ ఆఫీస్లో హర్యానా అసిస్టెంట్ అడ్వకెట్ జనరల్గా (AAG) అపాయింట్ కావడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ అధికారి వీఎస్ కుందూ కూతురిని వెంటపడి వేధించిన పోకిరీల్లో ఈ వికాస్ బరాలా ఒకడు. అలాంటి వ్యక్తికి న్యాయ శాఖలో పదవిని కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐఏఎస్ అధికారి కూతురిని వేధించి కిడ్నాప్కు యత్నించిన కేసులో వికాస్పై, అతని స్నేహితులపై 2017లో కేసు నమోదైంది. ఆగస్ట్ 5, 2017లో ఇతనిపై ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఛండీఘర్ కోర్టులో ఇప్పటికీ ఈ కేసు పెండింగ్లోనే ఉంది. ఈలోపే కురుక్షేత్ర యూనివర్సిటీలో వికాస్ న్యాయ శాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్నాడు. రాజకీయ నాయకుడి కొడుకు కావడంతో ఈ కేసులో వికాస్కు వెంటనే బెయిల్ దక్కిందని అప్పట్లో ప్రతిపక్షం ఆరోపించింది.

ఒక వ్యక్తిపై ఏదైనా పోలీస్ కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగానికే అనర్హుడిగా మిగిలిపోతాడు. అలాంటిది.. ఒక ఎంపీ కొడుకుపై ఏకంగా ఒక యువతిని వేధించి.. కిడ్నాప్ చేయడానికి యత్నించాడని కేసు నమోదైనప్పటికీ పదవి కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉండగా ఢిల్లీలోని అడ్వకెట్ జనరల్ ఆఫీస్లో హర్యానా లీగల్ సెల్ ఆఫీసర్గా వికాస్ బరాలా నియామకం జరగడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.