25 గెటప్స్ లో విక్రమ్ 

25 గెటప్స్ లో విక్రమ్ 

మొదట్లో అందరు హీరోల్లాగే సినిమాలు చేసుకుంటూపోయాడు విక్రమ్. కానీ ఒక సమయంలో సడెన్‌‌గా రూటు మార్చాడు.వైవిధ్యమైన కథలను, పాత్రలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. నాటి నుంచి నేటి వరకూ ఆ దారిలోనే సాగుతున్నాడు. అయితే ఈసారి అతడు చేయబోయే ఎక్స్‌‌పెరిమెంట్‌‌ గురించి వింటేనే ఎక్సెపెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.

‘అంజలి సీబీఐ’ ఫేమ్‌‌ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఒక మూవీ చేసేందుకు కమిటయ్యాడు విక్రమ్. ఈ నెలలో సెట్స్‌‌కి వెళ్లనుంది. వచ్చే యేడు ఏప్రిల్‌‌లో విడుదల. ఇందులో విక్రమ్ ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా ఇరవై అయిదు లుక్స్‌‌లో కనిపిస్తాడట. ఈ యాక్షన్‌‌ సస్పెన్స్‌‌ థ్రిల్లర్​లో పాత్రను అనుసరించి విక్రమ్‌‌ రకరకాల గెటప్స్‌‌ వేస్తాడట. ఇది మామూలు ప్రయోగం కాదు. ఎందుకంటే ఒక్క సినిమాలో ఇరవై అయిదు రకాలుగా కనిపించడం సులభం కాదు. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఆ లుక్స్‌‌ తీసుకు రావడం కత్తి మీద సామే. ‘నవరాత్రి’లో శివాజీ గణేషన్, ఏఎన్నార్ తొమ్మిది, ‘దశావతారం’లో కమల్‌‌ పది లుక్స్‌‌లో కనిపించారు. వాళ్లను మించిపోయాడు విక్రమ్. ఈరికార్డును బ్రేక్ చేయడం మరెవరికీ సాధ్యం కాదేమో.