కరీంనగర్: వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన నిమ్మల కొమురయ్య వ్యవసాయ పనుల నిమిత్తం పొలం దగ్గరికి వెళ్లాడు. అక్కడ పొలంలో కొమురయ్యకు కొండచిలువ కనిపించింది. చుట్టుపక్కల ఉన్న గ్రామ రైతుల సహాయంతో కొండచిలువను పట్టుకొని స్థానిక గుట్టల్లో వదిలేశారు.
