ఇందిరమ్మ ఇంటికి రూ. 20 వేలు ఇవ్వాలట.. కరీంనగర్‌‌‌‌ జిల్లా కోర్కల్‌‌లో బైఠాయించి గ్రామస్తుల ధర్నా

ఇందిరమ్మ ఇంటికి రూ. 20 వేలు ఇవ్వాలట.. కరీంనగర్‌‌‌‌ జిల్లా కోర్కల్‌‌లో బైఠాయించి గ్రామస్తుల ధర్నా
  • అర్హుల ఎంపికలో అధికారులు, నేతల వసూలంటూ ఆరోపణ
  • కరీంనగర్‌‌‌‌ జిల్లా కోర్కల్‌‌లో బైఠాయించి గ్రామస్తుల ధర్నా  

వీణవంక, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన గ్రామస్తులు, మహిళలు శుక్రవారం రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కమిటీ సభ్యులు, అధికారులు తమకు నచ్చిన వారి పేర్లతో జాబితా ఇచ్చారని మండిపడ్డారు. 

 కొందరు నేతలు రూ.20 వేలు ఇస్తేనే ఇల్లు మంజూరు చేయిస్తామని అంటున్నారని వాపోయారు. ఇప్పటికే సొంతంగా ఇండ్లను నిర్మించుకునేవారి వద్ద డబ్బులు తీసుకొని ఇస్తున్నారని ఆరోపించారు. అర్హుల ఎంపికలో ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు  కోరారు. ఈ ధర్నాలో మర్రి కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ మర్రి స్వామి , మాజీ ఉప సర్పంచ్ పూదరి అనిల్, కృష్ణ, కొలిపాక రాకేష్, ఆంజనేయులు, రాజు బాబు, తిరుపతి, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.