బతుకమ్మ కేవలం ఉత్సవం కాదు ఓ ఉద్యమం: విమలక్క

బతుకమ్మ కేవలం ఉత్సవం కాదు ఓ ఉద్యమం: విమలక్క

చేవెళ్ల, వెలుగు: బతుకమ్మ పండుగ కేవలం ఉత్సవం మాత్రమే కాదని.. పర్యావరణ పరిరక్షణ, సామాజిక చైతన్యం, భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించే ఉద్యమమని ప్రజాగాయని విమలక్క అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరులో జరిగిన బహుజన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక గుండెచప్పుడని, అన్ని మతాలు, వర్గాల ప్రజలను ఏకం చేస్తూ, పుష్పాలను పూజించే ఈ పండుగ ప్రపంచ ఖ్యాతిని సాధించిందని చెప్పారు.