ఎంఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్.. ప్రారంభించిన కమిషనర్  వినయ్ కృష్ణారెడ్డి 

ఎంఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్.. ప్రారంభించిన కమిషనర్  వినయ్ కృష్ణారెడ్డి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) హెడ్డాఫీసులో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్​ను సోమవారం కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రారంభించారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారతను బలోపేతం చేయడంతో పాటు మున్సిపల్ ఉద్యోగులు, ప్రజలకు తక్కువ ధరల్లో పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భంగా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓడీలతో కలిసి క్యాంటీన్ లో భోజనం చేశారు. అవసరమైన చోట ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లను ప్రారంభించాలని యూసీడీ అధికారులను ఆదేశించారు.