చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్.. 5-0 తేడాతో సెమీస్లో గ్రాండ్ విక్టరీ

చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్.. 5-0 తేడాతో సెమీస్లో గ్రాండ్ విక్టరీ

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్లో రెజ్లింగ్లో ఫైనల్కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని సొంతం చేసింది. సెమీస్లో క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ లోపెజ్‌ను 5- 0 తేడాతో ఫోగట్ ఓడించింది. ఈ గెలుపుతో 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫోగట్ ఫైనల్కు చేరుకుంది. ఈ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ విభాగంలో ఇదే తొలి పతకం కావడం గమనార్హం. బంగారు పతకానికి వినేష్ ఫోగట్ అడుగు దూరంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్లో వినేష్ ఫోగట్ సత్తా చాటడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురిసింది.

 

సెమీ ఫైనల్లో ఇంత వన్సైడెడ్గా వినేష్ ఫోగట్ ఆధిక్యాన్ని కనబర్చడం చాలా గొప్ప విషయం. ఫైనల్లో కూడా వినేష్ ఫోగట్ నెగ్గితే పారిస్ ఒలింపిక్స్లో బంగారు పతకం భారత్ సొంతం కానుంది. మంగళవారం(ఆగష్టు 06) జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌ రెజ్లర్ ఒక్సానా లివాచ్‌ను 7 - 5 తేడాతో ఓడించి సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు వినేశ్ పోగట్ 3-2తో జపాన్‌కు చెందిన యుయి సుసాకిని మట్టికరిపించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ పోరు బుధవారం జరగనుంది. అమెరికా రెజ్లర్ సారా హిల్డెబ్రాండ్తో ఫైనల్లో వినేష్ ఫోగట్ తలపడనుంది.