బంజారాహిల్స్ లో దారుణం.. రోడ్డు ప‌క్క‌న వృద్ధిరాలి డెడ్ బాడీ

బంజారాహిల్స్ లో దారుణం.. రోడ్డు ప‌క్క‌న వృద్ధిరాలి డెడ్ బాడీ

హైద‌రాబాద్: బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 2లో దారుణం జ‌రిగింది. వృద్ధిరాలి డెడ్ బాడీని దుప్పటితో చుట్టి రోడ్డుప‌క్క‌న‌ పడేసి వెళ్లారు గుర్తు తెలియ‌ని వ్యక్తులు. స్థానికుల స‌మాచారం మేర‌కు ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు…కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన తర్వాత ఇక్కడ మృతదేహాన్ని పెట్టి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉన్న క్ర‌మంలో ఎవరైనా కోవిడ్ ‌తో చనిపోతే అలా పడేశారా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఆధారంగా వివ‌రాలు సేక‌రిస్తున్న‌ట్లు చెప్పారు పోలీసులు.  గోనె సంచిలో వృద్ధురాలి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.