సింగిల్స్ కు బంపర్ ఆఫర్.. అద్దెకు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ .. ఎక్కడో తెలుసా...

సింగిల్స్ కు బంపర్ ఆఫర్.. అద్దెకు  బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ..  ఎక్కడో తెలుసా...

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడటం కామన్ అయిపోయింది. అలాగే బ్రేక్ అప్ చెప్పి విడిపోవడం సర్వసాధారణం. ఎంత గానో ఇష్ట పడ్డ బాయ్ ఫ్రెండ్ ఏదొక రోజు దూరం పెట్టొచ్చనే భయం అమ్మాయిల్లో, అలాగే తన గర్ల్ ఫ్రెండ్ తనని వదిలేస్తుందనే భయం అబ్బాయిల్లో ఉంటుంది.అయితే ఇలాంటి వారి కోసం కొత్తగా ఆలోచించి.. ఆ దేశం బాయ్ ఫ్రెండ్ , గర్ల్ ఫ్రెండ్ అద్దెకు పొందవచ్చని ఒక పోర్టల్ ను తీసుకొచ్చింది. దీని దీని గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం..

మీ బాధలు, ఆనందాన్ని పంచుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్స్ బంధువులు ఎవ్వరూ లేరా. మీ రహస్యాలను షేర్ చేసుకునే లవర్ ఎట్ లీస్ట్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేరని బాధపడిపోతున్నారా. అయితే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అద్దెకు ఇస్తున్నారట.  మరి ఆ అడ్రస్ పెట్టండి  అని కామెంట్ చేయకండే మరి.. .... ఆ అవకాశం ఇక్కడనుకుంటున్నారేమో.. ఆశ, దోశ, అప్పడం, వడ.. ఇక్కడ కాదండీ..జపాన్‌లో...

 చాలా మంది అవివాహితుల్లో పెరుగుతున్న ఒంటరితనానికి ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు వెబ్ సైట్లను రూపొందించింది. దీని ద్వారా అద్దె ప్రాతిపదికన బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తీసుకోవచ్చు.  ప్రతి ప్రాబ్లమ్‌కీ ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది. కాస్తంత ఓపిగ్గా ఆలోచించాలంతే. జపాన్‌ ప్రభుత్వం ఇలానే ఆలోచించి ఓ పెద్ద సమస్యకి పరిష్కారం కనిపెట్టేసింది. లాంగ్‌టర్మ్ రిలేషన్‌షిప్‌లో కాకుండా నచ్చినప్పుడు ఓ పార్టనర్‌ పక్కనే ఉండాలనుకునే సింగిల్స్‌కి పెద్ద సాయం చేస్తోంది అక్కడి ప్రభుత్వం. గంటల లెక్కన పార్ట్‌నర్‌లను అద్దెకు తీసుకునే స్కీమ్ తీసుకొచ్చింది. ఇందుకోసం కొన్ని వెబ్‌సైట్‌లనూ లాంఛ్ చేసింది. కాకపోతే...గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న వెబ్‌సైట్‌లలో మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

 చాలా మంది పెళ్లిపై నమ్మకం కోల్పోతున్నారు. ఒంటరితనానికి అలవాటు పడుతున్నారు. పెళ్లిళ్లు చేసుకునే వాళ్ల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇలాగే కొనసాగితే మానసిక సమస్యలు వస్తాయని భావించిన జపాన్ ప్రభుత్వం అప్పుడప్పుడైనా కాస్త జాలీగా గడపాలనే ఉద్దేశంతో ఇలా  Rent A Girlfriend or Boyfriend స్కీమ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఈ సర్వీస్ అంత చీప్‌ ఏమీ కాదు. గంటకు రూ.3 వేలు కట్టాల్సిందే. అంతే కాదు. కచ్చితంగా రెండు గంటల పాటు బుక్‌ చేసుకోవాల్సిందే. 

అయితే మీరు ఎంచుకునే అమ్మాయి కావాలనుకుంటే.. అదనంగా రూ. 1200 చెల్లించాలి. తొలిసారి మాత్రం ఉచితమే. అదేవిధంగా బాయ్ ఫ్రెండ్ కావాలనుకునే అమ్మాయిలు కూడా అద్దె ప్రాతిపదికన పురుషులను అందించే కంపెనీలు, వెబ్ సైట్లను సంప్రదించి తీసుకోవచ్చు.... ఇప్పటి వరకూ గర్ల్‌ఫ్రెండ్ లేని వాళ్లు, ఎప్పుడూ ఓ అమ్మాయితో బయటకు వెళ్లని వాళ్లు, బిజీలో పడిపోయి అసలు అమ్మాయిలను పట్టించుకోని వాళ్లు...ఈ సర్వీస్‌ని తెగ వాడేస్తున్నారు.

రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..

అయితే...అమ్మాయిలను లేదా అబ్బాయిలను అద్దెకి తీసుకోవాలనుకుంటో కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. రెంటల్ గర్ల్‌ఫ్రెండ్‌తో డైరెక్ట్‌గా కాంటాక్ట్‌ అవడానికి కంపెనీ ఒప్పుకోదు. ఇక గర్ల్‌ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్ చేయాలని టిప్స్, కాస్ట్‌లీ గిఫ్ట్‌లు ఇవ్వాలని చూస్తే అసలు ఒప్పుకోరు. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది కంపెనీ. ఇక బాయ్‌ఫ్రెండ్‌ కావాలనుకునే అమ్మాయిలూ ఇలా రూల్స్ పాటించాల్సిందే. మరో హైలైట్ ఏంటంటే...కేవలం గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్‌ఫ్రెండ్స్‌నే కాదు ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా అద్దెకు తీసుకునే సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.