మినిమం కామన్ సెన్స్ మిస్ అయ్యింది దేశంలో.. మనుషులు మెంటల్ గాళ్ల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు.. భారతదేశంలో జరిగిన ఈ ఘటన ప్రపంచ దేశాలను సైతం అవాక్కయ్యేలా చేస్తుంది. జార్ఖండ్ లో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు పొట్టు పొట్టు తిడుతున్నారు. అసలు వీడికి బుద్ధి ఉందా అంటూ ఏకిపారేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అది ప్రయాణికుల రైలు.. ఏసీ బోగీ. అందులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. పైన ఉన్న బెర్త్ పై ఉన్నాడు. రైలులో.. ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న సమయంలో.. పూజలు చేయటం ప్రారంభించాడు. ప్రార్థనలు చేయటం వరకు ఓకే.. భజనలు చేయటాన్ని ఎవరూ తప్పుబట్టలేదు. అంతటిలో ఆగని ఆ మెంటల్ ప్రయాణికుడు.. బోగీలోనే.. తన బెర్త్ పైన.. దీపం వెలిగించాడు.. అగరబత్తీలు వెలిగించాడు.. ఆ తర్వాత కర్ఫూరం వెలిగించి హారతి ఇస్తున్నాడు..
ఈ మొత్తం వ్యవహారంతో బోగీలోని ప్రయాణికులు షాక్ అయ్యారు. అసలే ఏసీ బోగీ.. మీరు దీపాలు వెలిగించి.. హారతులు ఇస్తే జరగకూడని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటీ అంటూ నిలదీశాడు. అయినా వెనక్కి తగ్గని ఆ ప్రయాణికుడు తన దైవ భక్తిని మరింతగా పెంచాడు.. పూజ చేసుకుంటే తప్పేంటీ అని ఎదరు ప్రశ్నించాడు.
ప్రయాణికులు అందరూ తిరగబడ్డారు. పూజ చేసుకోవటం.. ప్రార్థనలు చేసుకోవటాన్ని ఎవరూ తప్పు బట్టటం లేదు.. వేల మంది ప్రయాణికులు ప్రయాణించే రైలులో.. ఫైర్ సేఫ్టీ నిబంధనలు తెలియవా.. ఏసీ బోగీలో దీపం వెలిగించటం.. అగరబత్తీలు వెలిగించటం.. హారతి ఇస్తే ఆ మంటలకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు.. నీ వల్ల ప్రయాణికులు అందరినీ ప్రమాదంలోకి నెట్టేస్తావా అంటూ నిలదీశారు. అప్పటికీ వెనక్కి తగ్గకపోవటంతో.. అతనిపై దాడికి రెడీ అయ్యారు. ఇక చేసేది లేక దీపం, అగరబత్తీలు ఆర్పేశాడు ఆ ప్రయాణికుడు.
బోగీలోని ప్రయాణికులు ఎవరూ అతని భక్తిని ప్రశ్నించటం లేదు.. అతని మతాన్ని ప్రశ్నించటం లేదు.. రైలులో అగ్గిపుల్ల కూడా వెలిగించకూడదు అనే నిబంధనలు, ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నాయి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏసీ బోగీలో నీ దీపానికి, అగరబత్తీల పొగకు అలారం మోగితే పరిస్థితి ఏంటీ.. జరగకూడని ప్రమాదం జరిగితే ఎవరికి నష్టం అని మాత్రమే ఆ ప్రయాణికులు ప్రశ్నించారు. బోగీలో ఆ భక్తుడిని ప్రశ్నించిన వాళ్లల్లో హిందూవులు కూడా ఉన్నారు.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తెలివైన వాడు ఎవడూ ఇలా చేయడు.. మూర్ఖుడు వీడు.. వీడికి వైరల్ వ్యాధి ఉన్నట్లు ఉంది అంటూ తిట్టిపోస్తున్నారు. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని.. ఇలాగే వదిలేస్తే మరికొందరు ఇలాంటి వాళ్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని డిమాండ్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు.
ఏసీ బోగీలో ఇలా చేయటం చూస్తుంటే.. అతనికి మినిమం కామన్ సెన్స్ ఉన్నట్లు లేదు అంటున్నారు నెటిజన్లు.
🚆A video circulating on social media shows a passenger performing prayers on the upper berth of an AC train coach while lighting incense sticks and an oil lamp.
— Jharkhand Rail Users (@JharkhandRail) July 26, 2026
A fellow passenger reportedly intervened, explaining that such acts can be dangerous. Smoke may trigger the train's… pic.twitter.com/79SrmBnAdW
