Viral Video ..వారెవ్వ... కదులుతున్న కారు టాప్​పై నిద్రిస్తున్న చిన్నారులు..

Viral Video ..వారెవ్వ...  కదులుతున్న కారు టాప్​పై నిద్రిస్తున్న చిన్నారులు..

జనాలు విచ్చలవిడిగా సోషల్​ మీడియాను వాడేసుకుంటున్నారు.  పాపులారిటి కోపమో.. నలుగురు తమ గురించే చర్చించుకోవాలని... క్రేజ్​ కోసం..  ఇష్టం వచ్చినట్టు సోషల్​మీడియాలో రచ్చ చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. తాజాగా మరో వణుకు పుట్టించే వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్​ చల్​ చేస్తోంది.  ఈ వీడియోను చూసిన నెటిజన్లు .... చిన్న పిల్లల పట్ల డ్రైవర్ నిర్లక్ష్యం పై దుమ్మెత్తి పోస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

రోడ్డు పై కారుపై ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు కారుపై నిద్రిస్తున్నారని కారు డ్రైవర్‌ను కొందరు వ్యక్తులు వారించినా బేఖాతరు చేయకపోవడం దుమ్మేత్తి పోస్తున్నారు.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో వీడియోను చూసిన నెటిజన్లు డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సంఘటన గోవాలో చోటు చేసుకుంది.  మాపుసా పట్టణ సమీపంలో కదులుతున్న ఓ కారుపై ఇద్దరు చిన్నారులు ప్రమాదకర రీతిలో నిద్రిస్తూ కనిపించారు. పర్రా గ్రామంలో  ఓ టూరిస్టు వాహనంలో వెళ్తుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

కదులుతున్న XUV కారుపై భాగంలో ఇద్దరు పిల్లలు నిద్రిస్తూ కనిపించారు అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్‌గా మారింది. కారుపై చిన్నారులు పడుకొని ఉండటంపై.. వీడియో తీస్తున్న వ్యక్తి డ్రైవర్‌ను ప్రశ్నించగా అతడు సమాధానం చెప్పకుండా డ్రైవింగ్‌ను కొనసాగిస్తూ ముందుకు వెళ్లిపోయాడు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ సెక్షన్‌లో సదరు టూరిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం విచారకరం. రిలాక్స్ అవడానికి గోవాకి వచ్చారు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా.. ఇది పిల్లలకు తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. సాధారణంగా అనిపించినా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలంటూ ఓ యూజర్‌ కామెంట్‌ సెక్షన్‌లో చెప్పుకొచ్చాడు.

ఈ వీడియోపై పోలీసులు సుమోటోగా చర్య తీసుకోవాలని మరొక యూజర్‌ డిమండ్‌ చేశారు. దీనిపై విచారణ జరిపి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పలువురు గోవా పోలీసులను కోరారు. ఈ ఘటనకు సంబంధించి మాపుసా పోలీసులు కారు నడిపిన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.