Virat Kohli: ఐపీఎల్ 2026 లొల్లి ఇప్పుడు అసలైన క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇవాళ ధర్మశాలలో జరిగే క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు పోటీపడబోతున్నాయి. గీ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిస్తే ఆ టీమ్ సీదా ఫైనల్‌కు వెళ్తుంది. దాంతోటి గిప్పుడు క్రికెట్ ప్రపంచమంతా మన రన్ మెషిన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైపే చూస్తాంది. ఈ సీజన్ పొడుగునా విరాట్ 14 ఇన్నింగ్స్‌లలో 50.63 సగటు, 163.82 భీకరమైన స్ట్రైక్ రేట్‌తో 500కి పైగా పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోయినా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది. కానీ ఆ మ్యాచ్‌లో కోహ్లి కేవలం 15 రన్స్ చేసి అవుటయ్యాడు. గిప్పుడు అదే ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌ను, ఫ్యాన్స్‌ను ఫుల్ టెన్షన్ పెడుతుంది. ఎందుకంటే ప్లేఆఫ్స్ అనగానే కింగ్ విరాట్ ఓల్డ్ రికార్డులని చూసి ఫ్యాన్స్ భయపడుతున్నారు.
ప్లేఆఫ్స్‌లో కోహ్లి ట్రాక్ రికార్డ్:
లీగ్ మ్యాచ్‌లలో సింహంలా గర్జించే కింగ్ కోహ్లి.. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల వరకు వచ్చేసరికి ఎందుకోగానీ చల్లబడుతున్నాడని ఓల్డ్ రికార్డ్స్ చెప్తున్నాయి.
* విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 17 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఆడితే.. కేవలం 26.40 సగటు, 121.10 స్ట్రైక్ రేట్‌తో కేవలం 396 రన్స్ మాత్రమే చేశాడు.
* ఇందులో కేవలం రెండంటే రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉండగా, కోహ్లి హైయెస్ట్ స్కోరు 70* పరుగులు (2011 క్వాలిఫైయర్-1 లో చెన్నైపై కొట్టింది).
* ఐదు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే విరాట్ పెవిలియన్ చేరగా.. ఒకసారి డకౌట్ కూడా అయ్యాడు. మరో ఐదు సార్లు 30 పరుగుల లోపలనే అవుట్ అయ్యాడు.
* గత సీజన్ క్వాలిఫైయర్ 1 లో కూడా 12 పరుగులే చేసి విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశ పరిచిండు, ఫైనల్లో 43 రన్స్ చేసిండు.
ఆర్సీబీకి సెహ్వాగ్ వార్నింగ్:
ఈ హై-వోల్టేజ్ క్వాలిఫైయర్ మ్యాచ్ గురించి భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అదిరిపోయే విశ్లేషణ ఇచ్చిండు. ఆర్‌సీబీ కంటే గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ లైనప్ చాలా బాగుందని అభిప్రాయపడ్డాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన లాస్ట్ లీగ్ మ్యాచ్‌లో భువనేశ్వర్, హేజిల్‌వుడ్ లాంటి మెయిన్ బౌలర్లు వికెట్లు తీయకపోవడంతో బెంగళూరు దారుణంగా ఓడిపోయిందని గుర్తు చేశాడు. గత పరాజయాన్ని మర్చిపోయి ముందుకు సాగాలని.. ఒకవేళ ఇవాళ ప్లేఆఫ్స్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయితే మాత్రం బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థికి 255 రన్స్ కంటే ఎక్కువే సమర్పించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించిండు. ఆర్‌సీబీ గెలవాలంటే బ్యాటింగే కాదు, బౌలర్లు కూడా గ్రౌండ్‌లో చెమటోడ్చడం చాలా ఇంపార్టెంట్ అని వీరూ భాయ్ సూచించాడు.
